కలం, వెబ్ డెస్క్: తాడేపల్లిగూడెంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది (Ugadi) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సతీ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి పంచాంగ శ్రవణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు.

