Mobile Popup Ad
Mobile Popup Ad

ఖ‌తార్‌పై దాడి చేస్తే ఊరుకోం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లోని అతిపెద్ద ‘సౌత్ పార్స్’ గ్యాస్ క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసిందని, అయితే ఇది కేవలం ఒక చిన్న భాగంపై మాత్రమే జరిగిన దాడి అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ దాడి గురించి అమెరికాకు ముందుగా సమాచారం లేదని, అలాగే ఇందులో ఖతార్ దేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు విషయం తెలియక ఇరాన్ పొరపాటున ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ (LNG) గ్యాస్ ప్లాంట్‌పై దాడి చేసిందని, అది ఏమాత్రం సమర్థనీయం కాదని ట్రంప్ అన్నారు. ఖతార్ వంటి అమాయక దేశంపై ఇరాన్ మళ్లీ దాడికి దిగితే.. అమెరికా ఊరుకోద‌ని ట్రంప్ హెచ్చ‌రించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>