కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో త్వరలో జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు (Sri Rama Navami Procession) సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27వ తేదీన నిర్వహించనున్న ఈ భారీ యాత్రకు ఎటువంటి పోలీసు భద్రత అవసరం లేదని స్పష్టం చేస్తూ ఆయన నగర పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాశారు.
గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత శోభాయాత్రల సమయంలో పోలీసు భద్రత పేరుతో భక్తులపై లాఠీచార్జీలు జరిగాయని, సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసే అటువంటి రక్షణ తమకు వద్దని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, రక్షణ పేరుతో ఆంక్షలు విధించడం కంటే అసలు బందోబస్తే లేకుండా యాత్రను నిర్వహించుకుంటామని రాజాసింగ్ (Raja Singh) తన లేఖలో పేర్కొన్నారు.
Read Also: తెలంగాణ బడ్జెట్ : హామీల కోసం ఎదురుచూపులు
Follow Us On : WhatsApp

