తెలంగాణ బడ్జెట్ : హామీల కోసం ఎదురుచూపులు

తెలంగాణ బ్యూరో, కలం: బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారీ ప్రజల్లో ఒక ఆసక్తి నెలకొంటుంది. అది కేంద్ర బడ్జెట్ అయినా.. రాష్ట్ర బడ్జెట్ అయినా. ప్రభుత్వాలు వరాలు ప్రకటిస్తాయేమోనన్న ఆశలే ఇందుకు కారణం. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన ఫస్ట్ బడ్జెట్‌లో (Telangana Budget) సంక్షేమంపై ఫోకస్ పెట్టింది. ఫస్ట్ ఇయర్‌లోనే రైతులకు సంపూర్ణ రుణమాఫీ సహా పలు గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. గత బడ్జెట్‌లో మాత్రం కొత్త స్కీమ్‌లేవీ ప్రకటించలేదు. అందుకే ఈసారి బడ్జెట్​లో కొత్త పథకాల కోసం ఎదురుచూపులు. మహిళలకు రెండున్నర వేల ఆర్థిక సాయం, వృద్ధాప్య పింఛన్ల పెంపు, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఇలాంటివేమైనా బడ్జెట్‌లో ఉంటాయేమోనన్న ఆశ. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు మేనిఫెస్టోలోని హామీల అమలు, ప్రభుత్వంపై ప్రజల నమ్మకం.. వీటి నేపథ్యంలో సీఎం నిర్ణయం, డిప్యూటీ సీఎం ప్రకటనపై ఉత్కంఠ నెలకొన్నది. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్​ టేబుల్​ కానున్న నేపథ్యంలో అమలుకాని హామీలు.. జనం ఎదురుచూపులపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Telangana Budget
Telangana Budget

Read Also: దేశంలోనే ఫస్ట్ ‘నెట్ జీరో’ సిటీగా ‘ఫ్యూచర్’ : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>