ప్రజలందరికీ ప్రమాద బీమా.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం !

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ప్రమాద బీమా (Accident Insurance) సౌకర్యాన్ని కల్పించేలా రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. తలా రూ. 5 లక్షల చొప్పున బీమా అందేలా ఆలోచిస్తున్నది. గ్రూప్ ఇన్సూరెన్స్ విధానంలో దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర పౌరులందరికీ దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నది. ఇందుకు ఎంత ఖర్చవుతుందనే అంచనాలను సిద్ధం చేస్తున్నది. ఈ అంచనాలు అందగానే బడ్జెట్‌లో (Telangana Budget) దాన్ని పొందుపర్చనున్నది. ప్రభుత్వ ప్రస్తుత ఆలోచన ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అప్లై చేసుకున్నవారందరికీ ఈ బీమా అందించాలన్నదే. మార్గదర్శకాల తయారీ సమయంలో ఎలాంటి మినహాయింపులుంటాయనే క్లారిటీ రానున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) ఈ నెల 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం నిధులను కేటాయించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

గతంలో రైతుబీమా.. నేడు ప్రమాద బీమా :

గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న అమల్లోకి తెచ్చింది. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న 18-59 ఏళ్ళ మధ్య వయసున్న రైతులు సహజంగానైనా ప్రమాదవశాత్తుగానైనా చనిపోయినా ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు బీమా స్కీమ్ వర్తించింది. ఏటా సగటున రూ. 1500 కోట్ల మేర ప్రభుత్వమే అర్హులైన రైతులందరి తరఫున ప్రీమియం చెల్లించేది. ఇప్పుడు రాష్ట్రంలోని పౌరులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని తేవాలనుకుంటున్న ప్రభుత్వం బడ్జెట్‌లో (Telangana Budget) ఏ మేరకు కేటాయిస్తుందనేది శుక్రవారం తేలనున్నది. ఏ వయసు వారికి వర్తింపజేయనున్నది, లబ్ధిదారులకుండాల్సిన అర్హతలేంటి తదితరాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

Read Also: విజన్ డాక్యుమెంట్ పవిత్ర గ్రంధం : సీఎం రేవంత్

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>