కలం, వరంగల్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ (Transport Department) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు(Road Safety Week Celebrations) నిర్వహించడం ఆనవాయితి. ఈ ఏడాది కాస్త భిన్నంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రవాణా, పోలీస్, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ తర్వాత అంతా షరా మాములే అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. ఆయా శాఖల్లో పేరుకుపోయిన అవినీతి కారణంగానే రోడ్డు భద్రతా ఉత్సవాలకు అర్థం లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇష్టారాజ్యంగా లైసెన్సులు
రవాణాశాఖలో ఇష్టారాజ్యంగా లైసెన్సుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. లంచం కొడితే చాలు డ్రైవింగ్ వచ్చినా, రాకపోయినా లైసెన్స్ చేతిలోకి వస్తుంది. ఒక వాహనదారుడు లైసెన్స్ కావాలంటే మొదట లెర్నింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకుని కంప్యూటర్ టెస్ట్ పాస్ కావాలి. అప్పటికీ కానీ లెర్నింగ్ లైసెన్స్ జారీ చేయరు. నెల రోజులు పూర్తయిన తర్వాత పర్మినెంట్ లైసెన్స్ కోసం మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని రవాణాశాఖ ఆఫీస్‌లోని 8 అంకె ఆకారంలో ఉన్న టెస్ట్ ట్రాక్ పై విజయవంతంగా బండి నడిపి లైసెన్స్ పొందాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇవేమీ లేకుండానే లైసెన్స్‌లు జారీ అవుతున్నాయి. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి లంచాలు తీసుకుంటున్న అధికారులు ఈజీగా లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు.
Read Also: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు యూనిలీవర్ పరిశీలన
Follow Us On: Instagram


