Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే వైసీపీ : పెద్దిరెడ్డి

కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా లేకున్నా గత 15 ఏళ్లుగా వైసీపీ ప్రజల కోసమే పనిచేసిందని ఆయన అన్నారు.

రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేయడమే తమ పార్టీ లక్ష్యమని.. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి వచ్చే నిధులను అమరావతి (Amaravati) లోనే ఖర్చు చేస్తున్నారని, ఇతర ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>