కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య వివాదం నేపథ్యంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు (Rowdy Sheeter Murder) గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే… యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెం గ్రామంలోని హరిహార కాటేజీలో నిశాంత్ ఠాగూర్ అనే రౌడీ షీటర్ గత రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది. అది కాస్తా ముదరడంతో రౌడీషీటర్ నిశాంత్‌ను స్నేహితులు ఇటుకలతో కొట్టి చంపారు.
అయితే మృతుడు నిశాంత్ (Nishant) గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు రౌడీషీటర్ నిశాంత్ ను ముందస్తు ప్లాన్ ప్రకారం హత్య (Murder) చేశారా..? లేక మద్యం తాగిన తర్వాత జరిగిన గొడవ వల్లే హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
Read Also: నిజామాబాద్‌లో గంజాయి ముఠా ఆగడాలు.. కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి పరార్..
Follow Us On: Sharechat


