epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

ఏపీలో RMZ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడులు

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు (AP Investments) పెట్టడానికి RMZ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్ (Davos) లో మంత్రి నారా లోకేష్ తో ఆర్ ఎంజడ్ కంపెనీ చైర్మన్ మనోజ్ మెండా మధ్య కీలక చర్చలు జరిగాయి. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1ఐటీ పార్క్ లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ తో పాటు 1 గిగాబైట్ సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడానికి లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ విషయాన్ని దావోస్ (Davos) సదస్సులో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ ఎంజడ్ చైర్మన్ మనోజ్ ప్రకటించారు.

విశాఖలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు.. ఏపీని టెక్నికల్ రంగంలో ముందుంచేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు మనోజ్ మెండా తెలిపారు. అటు రాయలసీమలోని టేకులోడు దగ్గర్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్ ను డెవలప్ చేయడానికి ఈ ఆర్ ఎంజడ్ సంస్థ ప్రతిపాదనలు చేసింది. ఈ పెట్టుబడులతో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>