కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్ తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రపంచ క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా వేసిన చివరి రెండు ఓవర్లు లేకుంటే.. ఒక ఓవర్ల మిగిలి ఉండగానే ఇంగ్లండ్ గెలిచి ఉండేదని అన్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు చివరి వరకు పోరాటం కొనసాగించింది. అయినా భారత బౌలర్లు ఒత్తిడిలోనూ నియంత్రణ చూపడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ కీలక మలుపు చివరి దశలో వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌల్ చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ స్పెల్‌తో మ్యాచ్ దిశ భారత్ వైపు తిరిగింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన స్టెయిన్.. బుమ్రా ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. తరచూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అతని ప్రత్యేకత అని చెప్పాడు. బుమ్రా ఆ రెండు ఓవర్లు లేకపోతే ఇంగ్లండ్ ఒక ఓవర్ ముందే లక్ష్యాన్ని చేరుకునేదని కూడా పేర్కొన్నాడు. మాజీ దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా బుమ్రా ప్రతిభను ప్రశంసించాడు. పరిస్థితి ఎలా ఉంటే అలా ఆడటం, తన నైపుణ్యంపై నమ్మకం పెట్టుకోవడం బుమ్రా బలం అని చెప్పాడు.
ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్ కూడా మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించిందని తెలిపాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కూడా కీలకమైందని పేర్కొన్నాడు. చివరి ఓవర్‌ను శివమ్ దూబేకు ఇవ్వడం పెద్ద నిర్ణయం అని చెప్పాడు. మొత్తంగా చివరి దశలో బుమ్రా, పాండ్యా వేసిన కీలక ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరి మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది.

