కలం, వెబ్ డెస్క్ : దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం అయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తూ తెలంగాణ రైజింగ్ 2047 కు మద్దతు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి వివరించేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి జెరెమీ జర్గెన్స్ తో చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. వివిధ దేశాల నుంచిప్రతిపాదనలు వస్తున్నా సరే హైదరాబాద్ లో నిర్వహించే విషయంపై త్వరలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్డ్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను, రోడ్ మ్యాప్, ఇతర టార్గెట్లను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంకరేజ్ చేస్తున్న విధానంపై జెరెమీ జర్గెన్స్ ప్రశంసలు కురిపించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లతో యూత్ కు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నామనేది కూడా సీఎం రేవంత్ (Revanth Reddy) వివరించారు. దీంతో పాటు 2024లో హైదరాబాద్ లో జరిగిన సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించామని.. ఆ విధంగానే ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. తమ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ దేశంలో నెట్-జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా ఉంటుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించారు.
Read Also: ప్రపంచ ఆర్థిక సదస్సు : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్
Follow Us On: X(Twitter)


