కలం, వెబ్ డెస్క్: ప్రియమణి.. ఏ పాత్రలో అయినా మెప్పించగల నటి. అయితే.. ఈ మధ్య అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. ఎక్కువగా వెబ్ సిరీస్‌లోనూ, రియాల్టీ షోలకు జడ్జీగాను వ్యవహరిస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ అమ్మడుకు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రియమణి(Priyamani)కి వచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి..?
ఎవరే అతగాడు సినిమాతో ప్రియమణి తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత పెళ్లైన కొత్తలో, యమ దొంగ, నవ వసంతం, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్ తదితర చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు తన అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ప్రియమణి(Priyamani) సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చింది. బుల్లితెర పై కూడా ప్రియమణి హవా కొనసాగిస్తోంది. పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా పని చేస్తూ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటోంది.
ఇప్పుడు ప్రియమణికి మెగాస్టార్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఇది ప్రియమణికి బంపర్ ఆఫరే అని చెప్పచ్చు. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో ఫుల్ జోష్ లో ఉన్న చిరు నెక్ట్స్ బాబీతో సినిమా చేయనున్నారు. ఇందులో చిరుకు జంటగా ప్రియమణి నటిస్తుంటే.. కూతురుగా కృతి శెట్టి నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ మూవీలో నటిస్తుండడం విశేషం. ఇది బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మాఫియా స్టోరీతో ఉంటుందని.. అలాగే ఫాదర్, డాటర్ సెంటిమెంట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
ప్రియమణి నాగార్జునకు జంటగా రగడ సినిమాలో నటించింది. ఆమె నటన గురించి ప్రత్యేకించి చెప్పాలసిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే మెప్పించిన గుడ్ పర్ ఫార్మర్. అయితే.. ఆశించిన స్థాయిలో ఈ అమ్మడుకు స్టార్స్ తో నటించే ఛాన్స్ రాలేదని చెప్పచ్చు. ఇప్పుడు మెగాస్టార్ తో నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్. ఇందులో చిరు, ప్రియమణి మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. ఈ నెలలోనే ఈ సినిమా ప్రకటించి త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరి.. ఈ మూవీతో ప్రియమణి మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.


