కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియయజేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), పలువురు మంత్రులు లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. నారా లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


