విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

కలం, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడల్లా వేదికపై డీజీపీ శివధర్‌‌‌‌రెడ్డితో పాటు ఓ మహిళ కనిపిస్తూ ఉంటారు. పోలీస్ యూనిఫామ్‌‌‌‌లో కనిపించే ఐపీఎస్ ఆఫీసర్ల పక్కన చీర కట్టుకుని ఆమె చాలా సాదాసీదాగా కనిపిస్తారు. చూడడానికి సింపుల్‌‌‌‌గా ఉన్నా.. మావోయిస్టుల లొంగుబాట్ల వెనుక కీలక సూత్రధారి, వ్యూహకర్త, సైలెంట్ ఆపరేషన్ నిర్వహించే ఇంటెలిజెంట్. ఆమె ఎవరో కాదు.. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్, ఐజీ సుమతి (Sumathi IPS).

2001లో డీఎస్పీగా పోలీస్ సర్వీస్‌‌‌‌లో చేరిన సుమతి.. ఆ తర్వాత 9 ఏండ్లకే ఐపీఎస్‌‌‌‌గా ప్రమోషన్ పొందారు. ఆపరేషన్ కగార్‌‌‌‌ను కేంద్రం అఫీషియల్‌‌‌‌గా ప్రకటించే సమయానికి ఎస్ఐబీ బాధ్యతల్లోకి వచ్చిన ఆమె.. ఎన్‌‌‌‌కౌంటర్లు, అరెస్టుల్లాంటివి లేకుండా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సైతం తెలంగాణ ఎస్ఐబీని ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎస్ఐబీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఐపీఎస్ సుమతిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Sumathi IPS
Sumathi IPS

Read Also: ‘నారీ శక్తి’.. అయినా ఆగని వివక్ష

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>