ఫిరాయింపుల పితామహుడు కేసీఆరే: మంత్రి సీతక్క

కలం, వెబ్​ డెస్క్​ : గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపుల తీర్పుపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, రాజకీయ లబ్ధి కోసం గతంలో బీఆర్ఎస్ (BRS) వ్యవహరించిన తీరును తెలంగాణ సమాజం మర్చిపోలేదని ఆమె అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులకు పురుడు పోసింది బీఆర్ఎస్ పార్టీయేనని, ఆ పార్టీ అధినేత కేసీఆరే ఫిరాయింపుల పితామహుడని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోవడమే కాకుండా, ఏకంగా మండలి చైర్మన్ పదవిని కూడా లాగేసుకున్న చరిత్ర వారిదని సీతక్క ఎద్దేవా చేశారు.

ఇతర పార్టీల్లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వంటి నేతలను చేర్చుకుని నేరుగా మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు లేని నీతులు ఇప్పుడు కేటీఆర్‌కు గుర్తొస్తున్నాయా అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అది అభివృద్ధి కోసమని, అదే ఇతర పార్టీలు చేస్తే ప్రజాస్వామ్యంపై దాడి అని మాట్లాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. స్పీకర్ తన పరిధిలో ఉన్న అధికారాల మేరకే ఫిరాయింపుల అంశంపై నిర్ణయం తీసుకున్నారని సమర్థించారు. కేటీఆర్ (KTR) ముందుగా గతంలో చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాతే సిద్ధాంతాల గురించి మాట్లాడాలన్నారు.

బీజేపీ వైఖరిని కూడా మంత్రి తప్పుబట్టారు. విపక్షాలను పూర్తిగా మింగేస్తున్న బీజేపీ నేతలు ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. బీహార్‌లో నితీష్ కుమార్‌ను అడ్డు పెట్టుకుని సీఎం కుర్చీని లాక్కుంటున్న వైనంపై బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలని సీతక్క (Seethakka) డిమాండ్ చేశారు.

Read Also: తెలంగాణ గురించి పిచ్చి కూతలు కూయొద్దు.. ఏపీ నేతలపై కేటీఆర్ ఫైర్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>