స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం : ఎన్.రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆరు నెలలలోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ చూసిన విషయమని పేర్కొన్నారు.

ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యకరమని తెలిపారు. అదే విధంగా, ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా దీనిని పార్టీ ఫిరాయింపుగా పరిగణించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య అని విమర్శించారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరచడమేనని పేర్కొన్నారు.

యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని అప్పటి ప్రధాని రాజీవ్  గాంధీ  రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో యాంటీ డిఫెక్షన్ చట్టం ఉల్లంఘనకు గురవుతున్నప్పటికీ స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినట్లేనని ఆయన ఆరోపించారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ మరోవైపు పార్టీ నాయకుల చర్యలను సమర్థించేలా తీర్పులు రావడం ఎలా సమర్థించగలరని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ప్రశ్నించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగాన్ని, ప్రజల తీర్పును కూడా అవమానించేలా ఉందని.. ఈ తీర్పుపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆయన (Ramchander Rao) అన్నారు.

Read Also: ఆ ఒక్కడు ఎక్కడ? గణపతి పై వీడని సస్పెన్స్!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>