కలం, డెస్క్ : తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిన్నచూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. ప్రతిసారి బడ్జెట్ లో తెలంగాణకు సరైన కేటాయింపులు చేయట్లేదన్నారు. ఈ సారైనా తెలంగాణకు సరైన కేటాయింపులు చేసేలా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని చెప్పారు. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు ఏం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కానీ బడ్జెట్ లో కేటాయించట్లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ విషయంలో సమాలోచన చేయాలి. బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపిస్తే బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బీఆర్ ఎస్ గత పదేళ్లలో కేంద్రాన్ని ఎన్నడూ నిధుల విషయంలో నిలదీయలేదని.. కేంద్రం నుంచి ఏమీ ఆశించబోమని గులాబీ పార్టీ వాళ్లు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో సయోధ్య కోరుకుంటోందన్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తే మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని.. పక్క రాష్ట్రాలకు నిధులు కేటాయించినా తప్పుబట్టట్లేదని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సారి బడ్జెట్ లో త్రిబుల్ ఆర్ కు, మెట్రో ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళన కోసం నిధులు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. కేంద్ర విద్యా సంస్థల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభకార్.


