కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శనివారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షీ, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో పనిచేయాలని, రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.
ఓడిపోతామన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చూపించామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల పరిధిలో ఏమేం సమస్యలు ఉన్నాయో గుర్తించాలని మంత్రుల (Ministers)కు ఆదేశాలు జారీ చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తానని సీఎం రేవంత్ (Revanth Reddy) జూమ్ మీటింగ్‌లో తెలిపారు. కాగా రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Read Also: తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిన్నచూపు : పొన్నం ప్రభాకర్
Follow Us On: Instagram


