Mobile Popup Ad
Mobile Popup Ad

రాజకీయాలని కుదిపేస్తోన్న డ్రగ్స్ వివాదాలు

కలం, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు స్కూళ్ల దగ్గర గంజాయి చాక్లెట్లు, కాలేజీల దగ్గర హాష్ ఆయిల్.. పబ్‌లలో డ్రగ్స్.. ఇప్పుడు ఫామ్​హౌస్‌లలో కొకైన్ పొట్లాలు కామన్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ పొలిటీషియన్లు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడటం (Politicians in Drugs Cases) ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మొయినాబాద్ లోని ఫామ్​హౌస్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ఎంపీ పోలీసులు నిర్వహించిన రైడ్స్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరి వద్ద నిషేధిత మాదకద్రవ్యాలు దొరికాయి. డ్రగ్స్ టెస్టులో ఇరువురికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ ఇద్దరికీ ఆయా పార్టీల హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ వ్యవహారాల్లో చిక్కుకోవడంతో మొదలైన పొలిటికల్ డిబేట్.. రోడ్లమీద డ్రంకన్ డ్రైవ్ తరహాలోనే అసెంబ్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులకూ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ డిమాండ్స్ చేసే వరకూ వెళ్ళింది.

గతంలో ‘వైట్ ఛాలెంజ్‌’లు.. ఇప్పుడు అసెంబ్లీలోనే టెస్టింగ్ సెంటర్ పెట్టాలంటున్న కొందరు.. ఎప్పుడు పెట్టినా ఎక్కడకు రమ్మన్నా రెడీ అంటూ ఇంకొందరు.. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ మధ్య సవాళ్లు – ప్రతిసవాళ్లు. పొలిటీషియన్లకు డ్రగ్స్ దందాలతో లింకులున్నట్లు మరికొందరి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను వేసవి ఎండలకంటే వేడెక్కిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ‘డ్రగ్స్-ఫ్రీ తెలంగాణ’ టార్గెట్‌గా ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్టుల నుంచి ఫామ్‌హౌస్​లకు షిప్ట్ అవుతున్న డ్రగ్స్ పై డేగ కన్ను పెట్టింది. ప్రభుత్వ పక్కా విజన్.. దానికి తగిన యాక్షన్ ప్లాన్ తో డ్రగ్స్ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ పేరెత్తితే అటు సినీ ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్ లీడర్స్ పేర్లు ఎందుకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆంక్షలను బేఖాతర్ చేస్తూ ప్రజాప్రతినిధులే అడ్డదారులు తొక్కడం దేనికి సంకేతం? మత్తులో యువత చిత్తవుతున్నారా? లేక నేతలు తమ నిజస్వరూపాలు బయటపెడుతున్నారా? నాటి బీఆర్ఎస్ సర్కార్ నుంచి నేటి కాంగ్రెస్ సర్కార్ వరకు… రాష్ట్రంలో ఎన్ని డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి? ఎంతమంది అరెస్టయ్యారు? పక్కా లెక్కలతో కలం 360 డిగ్రీస్ స్పెషల్.. చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Politicians in Drugs Cases
Politicians in Drugs Cases

Read Also: టార్గెట్ త్రీ మంత్స్.. డ్రగ్స్ కేసుపై సిట్ ప్లాన్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>