Mobile Popup Ad
Mobile Popup Ad

నెహ్రూ హయాంలో ఇరిగేషన్ – ఎడ్యుకేషన్ : రేవంత్

కలం, తెలంగాణ బ్యూరో: మహాత్మాగాంధీ (Mahatma Gandhi) మహాసంకల్పంతో చేపట్టిన భారత స్వాతంత్ర్య పోరాటం విజయం సాధించి 1947 ఆగస్టు 15 నుండి మనం స్వతంత్ర దేశంగా ప్రయాణాన్ని మొదలు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్నామన్నారు.

దేశ విభజన, మతకల్లోలాలు లాంటి అత్యంత సంక్షోభ సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Nehru) దేశ తొలి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ దేశ పునర్నిర్మానానికి పునాదులు వేశారని సీఎం గుర్తు చేశారు. ఆ నాటి పరిస్థితులను బట్టి మన దేశాభివృద్ధికి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ గ్రోత్ ఇంజిన్లు అవుతాయని నెహ్రూ అనాడే విశ్వసించారని చెప్పారు. నెహ్రూ కాలంలోనే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఆయన విజనే ఈ నాటికీ ఈ దేశాన్ని సుస్థిరమైన, బలమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిందనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నెహ్రూ హయాంలోనే ఐఐటీలు

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో ఐఐటీలు రూపుదిద్దుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 76 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెహ్రూ – ఇందిర శకం, పీవీ నర్సింహారావు – మన్మోహన్ సింగ్ శకం, ప్రస్తుతం నడుస్తోన్న శకమంటూ అభివర్ణించారు. నెహ్రూ హయాంలో ఇరిగేషన్ – ఎడ్యుకేషన్ ఈ దేశ గ్రోత్ ఇంజన్లుగా నిలిచాయని రేవంత్ పేర్కొన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా భావించి రూపొందించారని గుర్తు చేశారు. ‘పంజాబ్, హరియాణ రాష్ట్రాలకు సంబంధించి సట్లెజ్ నదిపై భాక్రా – నాంగల్ ప్రాజెక్టు, ఒడిస్సా రాష్ట్రంలో మహానదిపై హిరాకుడ్ డ్యామ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కు సంబంధించి దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ కు సంబంధించి రిహాండ్ డ్యాం (భారత్ లో అతిపెద్ద రిజర్వాయర్లలో ఒకటి) బీహార్ రాష్ట్రానికి సంబంధించి కోసి ప్రాజెక్టు నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు నెహ్రూ శంకుస్థాపన చేశారు.’ అని రేవంత్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులే ఆ తర్వాత కాలంలో భారతదేశంలో హరిత విప్లవానికి ఆధారమయ్యాయన్నారు. భారత దేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశంగా నిలబెట్టాయని చెప్పారు. ఆహార ధాన్యాల కొరత నుండి… ఆహార ధాన్యాల ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లామని గుర్తు చేశారు.

ఇరిగేషన్ లోనే కాదు… ఈ దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మించబడుతుందని నమ్మిన నెహ్రూ ఎడ్యూకేషన్ రంగానికి బలమైన పునాదులు వేశారన్నారు. IIT లను ప్రవేశ పెట్టి ఈ దేశ నిర్మాణానికి ఇంజినీర్లను తయారు చేసే కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దారని చెప్పారు. 1951 నుండి 1961 మధ్య… ఖరగ్ పూర్, బాంబే, మద్రాస్, కాన్ఫూర్, ఢిల్లీ IITలను నెహ్రూ స్థాపించారు. వీటికి తోడు 1961లో కలకత్తా, అహ్మదబాద్ లో IIM లను నెలకొల్పి మేనేజ్ మెంట్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు.

Read Also: అజిత్ పవార్ మరణంపై అమిత్‌షాకు సంచలన లేఖ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>