కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ (Bodhan) లో పదవ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రం బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్కూల్ ఆవరణలోనే కొందరు మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన విద్యా వ్యవస్థలో భద్రతా లోపాలను బయటపెట్టిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నపత్రం లీక్‌పై సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

