ఇదేంది అధ్యక్షా… నామమాత్రంగా అసెంబ్లీ సమావేశాలు!!

కలం, తెలంగాణ బ్యూరో: ‘సభను (Telangana Assembly) ఎన్ని రోజులు నడపడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది..’ అధికార పక్షం తరచూ చెప్పే మాట ఇది!

‘కేవలం బిల్లుల ఆమోదం కోసమే సభను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు..’ ప్రతిపక్షం రెగ్యులర్‌‌‌‌గా చేసే కామెంట్ ఇది!

ఏ పక్షం వాదన ఎలా ఉన్నా ఏటేటా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల సిట్టింగ్ డేస్ తగ్గిపోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ రెండో టర్ములో (2019-23) మొత్తంగా 73 రోజులే జరిగింది. సంవత్సరానికి సగటున 15 రోజులైనా జరగలేదు. ఏడాదికి కనీసంగా రెండుసార్లు చట్టసభలు సమావేశం కావాలన్న నిబంధనే తప్ప.. నిర్దిష్టంగా ఎన్ని రోజులు జరగాలనే స్పష్టత లేకపోవడంతో సెషన్స్ ఒక ప్రహసనంగానే మిగిలిపోయాయి.

అధికార, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం అంటూ నేతలు గంభీర ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు నామమాత్రం. సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అధికార పక్షం, మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షం పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌‌‌‌కు ప్రాధాన్యం తగ్గిపోతున్నది. ఫలితంగా ప్రజల, నియోజకవర్గాల సమస్యలను సభ్యులు ప్రస్తావించలేకపోతున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ‘కలం’ 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: అన్నదాతలకు గుడ్​ న్యూస్​.. ‘రైతు భరోసా‘ ముహూర్తం ఫిక్స్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>