కేసీఆర్ జీతం బయటపెట్టిన రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మీద, ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆయన సభకు ఎందుకు రావడం లేదని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. కొత్త గవర్నర్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనకు గౌరవించడం, సభా సంప్రదాయాలు పాటించడం సభ్యత అని పేర్కొన్నారు. కేసీఆర్ 2023 డిసెంబర్ 1 నుంచి నేటి (మార్చి 18, 2026) వరకు దాదాపుగా ఒక కోటీ ఆరు లక్షల 54 వేలు (రూ. 1.06 కోట్లు) జీతం తీసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఏ ప్రభుత్వ సర్వెంట్ అయినా వేతనం తీసుకున్నప్పుడు విధులు నిర్వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యత మరిచి రాచరిక పోకడలు కొనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం అత్యంత హుందాగా ప్రవర్తిస్తుందని తాము భావించామని చెప్పారు. కానీ ప్రతిపక్షం మాత్రం గవర్నర్ మీద కనీస గౌరవం లేకుండా వ్యవహరించిందని రేవంత్ (Revanth Reddy) ఫైర్ అయ్యారు. ‘విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జీతం కట్ చేస్తున్నాం కదా.. అలాగే సభకు రాని ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవాలి’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: తెలంగాణ CS కి కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>