కలం, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్షమంటే ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించేది.. పాలనలోని లోపాలను నిలదీసేది.. ప్రజల తరఫున గొంతెత్తి నిలిచేది.. ఇదీ జనంలో ఉండే సాధారణ అభిప్రాయం. కానీ తెలంగాణ, ఏపీలోని ప్రతిపక్ష పార్టీల రూటే సెపరేట్. ప్రతిపక్ష నేతలకు ఆ బాధ్యత పట్టదు. ప్రజల గొంతుకగా ఉండాలన్నా స్పృహే లేదు. అసెంబ్లీ వైపు చూడడమే లేదు. అటెండెన్స్ (Assembly Attendance) కోసమే సమావేశాలకు హాజరు. హోదా కోసం, ప్రొటోకాల్ కోసం పాకులాటలో తక్కువేమీ లేదు. క్రమం తప్పకుండా జీతం, అలవెన్సుల్లో తగ్గేదే లేదు. బాధ్యతల్లో మాత్రం డోన్ట్ కేర్.
గడిచిన రెండున్నరేండ్లలో ఏడుసార్లు అసెంబ్లీ సెషన్లు జరిగితే ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరైంది మూడింటికే. గతేడాది డిసెంబర్ లాస్ట్ వీక్ సెషన్‌కు అలా వచ్చి.. ఇలా సంతకం పెట్టి.. మూడు నిమిషాలకే వెళ్లిపోయారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలూ వాకౌట్లు, బాయ్‌కాట్లతో సరిపెట్టుకుంటున్నారు. మైక్ ఇవ్వడం లేదని, గొంతు నొక్కుతున్నారన్నది వారి వాదన.
ఏపీలో జగన్ ధోరణీ ఇంతే. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, అందుకే సభకు రావడం లేదన్నది వైసీపీ వాదన. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ పాత్ర కూడా అలాంటిదే. కారణాలెన్ని చెప్పినా ఎంపీల యావరేజ్‌తో పోలిస్తే రాహుల్ గాంధీ అటెండెన్స్ తక్కువే. అయితే.. సభలో ఉన్నంత సేపు మాత్రం ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే సమయాన్ని రాహుల్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ప్రజల్లోనూ తిరుగుతున్నారు.
ప్రతిపక్షాల తీరుపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Read Also: నల్లగొండ రహదారులు రక్తసిక్తం.. 75 రోజుల్లో 72 మంది మృతి
Follow Us On: Instagram

