epaper
Monday, January 26, 2026
spot_img
epaper

పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​: మనుషులకు ఎమోషన్స్ ఎలా ఉంటాయో.. జంతువులు, పక్షులకు కూడా ఉంటాయి. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మనుషుల మాదిరిగానే ప్రేమ, జాలి, కోపం లాంటివి వ్యక్తపరుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఓ పెంగ్విన్ (Penguin) వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అంటార్కిటికాలో మంచు ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోయారు. తన దారికి అడ్డంగా ఉండటంతో ఓ పెంగ్విన్ ఎంతో ఓపికగా ఎదురుచూసింది. వారు గమనించి పెంగ్విన్‌కు దారి ఇవ్వగానే ముందుకువెళ్లింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral)గా మారింది. పెంగ్విన్ చర్యకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.

Read Also: గణతంత్ర వేడుకల్లో ‘సిందూర్’ ఆయుధ​ సత్తా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>