కలం, డెస్క్ : మార్కాపురం (Markapuram) జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన వైసీపీ నేత కిరణ్ తండ్రి చనిపోయాడు. దీంతో కిరణ్ తండ్రి శవాన్ని గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇండ్ల మధ్య ఉన్న స్కూల్ ఆవరణలో పూడ్చి పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. స్కూల్ పిల్లలు భయపడుతారని వద్దని టీచర్లు, గ్రామస్తులు చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు. అది తన స్థలమే అని పట్టుబడి స్కూల్ ప్లే గ్రౌండ్ లోనే తండ్రి శవాన్ని పూడ్చిపెట్టాడు కిరణ్. ఈ విషయం మీద గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సెక్రటరీకి చెప్పినా అడ్డుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయం మీద తహసీల్దార్ కిశోర్ కుమార్ కు ఫిర్యాదు చేయగా.. శవం పూడ్చిపెట్టిన స్థలం చుట్టూ గోడ కట్టాలంటూ కిరణ్ కు తహసీల్దార్ సూచించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఆ ఉచిత పథకంపై వెంకయ్య నాయుడు అసంతృప్తి
Follow Us On: Sharechat


