నాకు రేవంత్‌రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం లేదు: కేరళ సీఎం

కలం, వెబ్ డెస్క్: కేరళ ఎన్నికల (Kerala Elections) ప్రచారంలో భాగంగా తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) స్పందించారు. రేవంత్‌రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం తనకు లేదని కొట్టిపారేశారు. రేవంత్‌తో చర్చకు దిగేందుకు తెలంగాణలో పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలే రేవంత్‌ ప్రభుత్వ పనితీరుపై తీర్పు ఇవ్వాలని అన్నారు. కాగా, మంగళవారంతో కేరళలో ప్రచారం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘పిన‌రయి విజ‌య‌న్‌తో పాటు కేర‌ళం క‌మ్యూనిస్టు మ‌హిళా నాయ‌కుల‌ను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నా. తెలంగాణ‌లోని ఏ మూల‌కైనా వెళ్లి మేం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వారు ప‌రిశీలించ‌వ‌చ్చు. ఈ విష‌యంలో నేను విజ‌య‌న్‌కు స‌వాల్ విసురుతున్నా. ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలపై తెలంగాణ‌కు వ‌చ్చి అన్నీ ప‌రిశీలించుకోవ‌చ్చు. మా స‌వాళ్ల‌కు విజ‌య‌న్ (Pinarayi Vijayan) స‌మాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.

Read Also: ఆఖరికి.. వాటర్ ప్యాకెట్స్ కూడా కల్తీనే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>