సిపిఐ పార్టీ సస్థాగతంగా బలోపేతం కావాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో : సిపిఐ(CPI) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas)  పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పునరుద్ధరించే సభ్యత్వాన్ని ఈసారి విస్తృతంగా చేపట్టాలని, కొత్త సభ్యులను చేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, సైద్ధాంతిక అవగాహన పెంపొందించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. పార్టీ నాయకత్వం గ్రామ స్థాయిలో పనిచేసి ప్రజా సంఘాల నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

అలాగే, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఇరాన్‌లో సంపూర్ణ అధికార మార్పు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>