Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌లో సంపూర్ణ అధికార మార్పు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్​ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్ రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో (Iran) దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పాలన ముగింపు దశకు చేరుకుందని, అక్కడ సంపూర్ణ అధికార మార్పు సంభవించనుందని ఆయన తెలిపారు. ఒక పురాతన నాగరికత అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలివైన, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన నాయకత్వం వల్ల అద్భుతాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత 47 ఏళ్లుగా ఇరాన్ ఎదుర్కొంటున్న అవినీతి, దోపిడీ, అశాంతికి నేటితో ముగింపు పలకబోతున్నామని ట్రంప్ (Trump) పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అత్యంత కీలకమైన ఘట్టమని, ఈ మార్పు వల్ల ఇరాన్ ప్రజలకు కొత్త భవిష్యత్తు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ ప్రజలకు దైవ దీవెనలు ఉండాలని కోరుకుంటూ, ఈ రాత్రి జరగబోయే పరిణామాలు ప్రపంచ గమనాన్ని మారుస్తాయని ఆయన తన సందేశంలో వెల్లడించారు.

Read Also: నాకు రేవంత్‌రెడ్డితో చర్చకు దిగే ఉద్దేశం లేదు: కేరళ సీఎం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>