కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా పాలకుర్తి మండలంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పాలకుర్తి నుంచి స్టేషన్ ఘన్పూర్ వైపు వెళ్తున్న కారు.. మొదట గూడూరు వద్ద బైక్ను బలంగా ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అదే కారు పాలకుర్తి శివారులోకి రాగానే మరో బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

