కలం, సినిమా : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi movie). బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న పెద్ది సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో చరణ్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మధ్య ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ షేక్ అయ్యింది. దీంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత మార్చి నుంచి మే కి షిప్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెద్ది ప్లేస్ లో విశ్వంభర రాబోతుందని టాక్. ఇంతకీ.. ఏమైంది..?
పెద్ది సినిమాని మార్చి 27న రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ.. ఆ టైమ్ లో బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 వస్తుండడంతో ప్లాన్ మారిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ తర్వాత మే లో విడుదల చేయడానికి ప్లానింగ్ మారిందని న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమాకి ఫస్టాఫ్ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యిందని.. బుచ్చిబాబు ఇప్పుడు సెకండాఫ్ పై ఫోకస్ పెట్టాడని ఇండస్ట్రీలో వినిపించింది. దీంతో మే నెలలో పెద్ది (Peddi movie) రావడం పక్కా అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఊహించని విధంగా విశ్వంభర (Vishwambhara) లైన్ లోకి వచ్చింది.
మెగాస్టార్ నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి అయితే.. క్వాలిటీ విషయంలో రాజీపడకూడదని వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మరింత కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ జులైలో వస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మే లో విశ్వంభర రాబోతుంది అనే న్యూస్ వైరల్ అయ్యింది. మరి.. పెద్ది ఎప్పుడు రానుందంటే.. ఏకంగా దసరాకి షిప్ట్ అయ్యిందని ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై పెద్ది, విశ్వంభర మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


