కలం, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ “ది రాజాసాబ్” (RajaSaab). సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపించింది. వింటేజ్ లుక్‌లో ప్రభాస్‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్‌ను మాత్రం అలరించింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో దర్శకుడు మారుతి (Maruthi) రూపొందించారు. థియేట్రికల్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఓటీటీ (OTT) డేట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.
రాజాసాబ్ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే హాట్ స్టార్ రాజాసాబ్ సినిమాను వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ చేయాలని హాట్ స్టార్ ప్లాన్ చేస్తుంది. హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రాజాసాబ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. త్వరలో రాజాసాబ్ (RajaSaab) ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Read Also: రజినీ బయోపిక్ అదిరిపోతుందట
Follow Us On : WhatsApp


