నాకు ఎలాంటి దురలవాట్లు లేవు : టీడీపీ ఎంపీ పుట్టా మహేష్

కలం, వెబ్ డెస్క్ : మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (Putta Mahesh) కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఏకిపారేస్తున్నాయి. వీరిద్దరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ వచ్చింది. ఈ క్రమంలోనే పుట్టా మహేష్ ఈ కేసుపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

తనకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. తన స్నేహితుడిని కలవడానికే మొయినాబాద్ ఫామ్ హౌజ్ కు (Moinabad Farm House) వెళ్లానని.. అంతకు మించి ఎలాంటి తప్పు చేయలేదని మహేష్ కుమార్ వెల్లడించారు. అక్కడున్న వారు రిక్వెస్ట్ చేస్తేనే ఆ డిన్నర్ కు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ డిన్నర్ లో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఏలూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని.. త్వరలోనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. దీంతో మహేష్ కుమార్ వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పడమేంటని మహేష్ కుమార్ ను (Putta Mahesh) విమర్శిస్తున్నారు.

Read Also: డ్రగ్స్ కేసు.. పుట్టా మహేష్‌కు షాక్ ఇచ్చిన టీడీపీ..

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>