తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్​ కు ప్రభుత్వం ఆహ్వానం

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లాను (Shiv Pratap Shukla) ప్రభుత్వం ఆహ్వానించింది. బడ్జెట్​ సమావేశాల సందర్భంగా ఉభయ సభల (Telangana Assembly) ను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్​ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్​ కు భట్టి సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్–ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్థిక శాఖ కార్యదర్శి స్కితా పట్నాయక్ తదితరులు ఉన్నారు.

కాగా, మార్చి 16న గవర్నర్​ ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు మొదలుకానున్నాయి. 20వ తేదీన తెలంగాణ బడ్జెట్​ ను ప్రభుత్వం శాసన సభ (Telangana Assembly)లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్​ ను ప్రవేశపెట్టనుండగా, మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read Also: డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించిన కోర్టు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>