Mobile Popup Ad
Mobile Popup Ad

వలిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

కలం, వలిగొండ : ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఇద్దరు బైకర్లు మృతి చెందిన విషాద ఘటన వలిగొండ మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని బోరబండ స్వరాజ్ నగర్ నివాసి అయిన అనురాగ్ రాయ్ (28) తన స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్ (NO. TS09FN6680) పై తొర్రూరు నుండి వలిగొండ వైపు వస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 5:30 గంటల సమయంలో వలిగొండ మండలం అరూరు గ్రామం శివారుకు చేరుకోగానే.. వలిగొండ (Valigonda) నుండి తొర్రూరు (Thorrur) వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (NO. AP07TG5418) వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

దీంతో అనురాగ్ రాయ్‌తో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు మోటార్ సైకిల్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వలిగొండ పోలీసులు (Valigonda Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధితుల చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: సినిమా టికెట్ రేట్లు పెంచడం దోపిడీ కాదు : పవన్ కల్యాణ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>