Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించిన కోర్టు

కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohith Reddy) ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రోహిత్‌రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్‌శర్మకు కూడా 14 రోజుల చొప్పున రిమాండ్ విధించింది. పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ ముగ్గురూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను జడ్జి తిరస్కరించారు. రిమాండ్ విధించాలని కోరుతూ ఈ ముగ్గురినీ పోలీసుల జడ్జి నివాసంలో హాజరుపర్చగా రివాల్వర్‌తో జరిగిన కాల్పుల అంశంపైనే లోతుగా వాదనలు జరిగాయి. డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్ళినప్పుడు రివాల్వర్‌తో కాల్పులు జరపడాన్ని జడ్జి తీవ్రంగా పరిగణించారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ నేరుగా పోలీసులకు గురిపెట్టి కాల్చారన్న వాదనలను జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. స్వయంగా నమిత్ శర్మ సైతం కాల్పులు జరిపినట్లు జడ్జి సమక్షంలో అంగీకరించారు. వీకెండ్ పార్టీకి మొత్తం 11 మంది హాజరుకాగా అందులో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ మేరకు ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసి వదిలేయడం, కొన్ని నిబంధనల మేరకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం పూర్తయింది. రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మలకు మాత్రం 14 రోజుల చొప్పున ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్ విధించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ ముగ్గురి తరఫున న్యాయవాదులు లేవనెత్తిన వాదనలను జడ్జి తిరస్కరించారు. రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

Read Also: ఖమ్మంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయి : మంత్రి తుమ్మల

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>