epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ఇరుసుమండ బాధితులకు పరిహారం ప్రకటించిన ఓఎన్జీసీ

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని కోనసీమ జిల్లా ఇరుసుమండ (Irusumanda) బ్లో అవుట్ బాధితులకు తాజాగా ఓఎన్జీసీ పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో నష్టపోయిన 6300 కుటుంబాలకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ఓఎన్జీసీ ఈడీ శాంతందాస్ తెలిపారు. గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి, ఇరుసుమండ గ్రామాల్లో నష్టపోయిన ప్రజలకు ఈ పరిహారం అందజేస్తున్నట్టు అమలాపురం కలెక్టరేట్ లో కలెక్టర్ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ తో కలిసి ఈడీ శాంతందాస్ వెల్లడించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఈ పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందజేస్తామని శాంతం దాస్ వివరించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. నష్టపోయిన కుటుంబాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై ఈడీ శాంతం దాస్ సానుకూలంగా స్పందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>