ఆఫ్గాన్ సంచలన నిర్ణయం.. బాలికలకు పాఠశాలల్లోకి నో ఎంట్రీ

కలం, వెబ్ డెస్క్: ఆఫ్గానిస్థాన్‌లో (Afghanistan)  తాలీబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, బాలికలపై అనేక కఠినమైన నిషేధాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా చదువు (Education), ఉద్యోగాలు, ప్రజా జీవితంలోకి వెళ్లకుండా మహిళలపై కఠిన పరిమితులున్నాయి. ప్రభుత్వం తమ నిర్ణయాలను సమర్థించుకుంటున్నప్పటికీ, ప్రపంచ దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆఫ్గానిస్థాన్‌లో మహిళల స్వేచ్ఛ, భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలోని బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ఆఫ్ఘానిస్తాన్ విద్యా శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. గతంలో ఆరో తరగతి వరకు అనుమతించినప్పటికీ, ఇకపై అన్ని స్థాయిల్లోనూ బాలికలు విద్యకు దూరంగా ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విద్యా సంస్థలన్నీ ఈ నియమాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఇతర దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నెటిజన్స్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాపం ఆఫ్గాన్ మహిళలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌కు మేధా పాట్కర్‌ కీలక లేఖ..

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>