టాలీవుడ్ పెద్ద దిక్కుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood) పెద్ద దిక్కుపై ఎప్పటి నుంచో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. దివంగత దాసరి నారాయణ రావు చనిపోయిన తర్వాత.. టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరనే దానికి సరైన సమాధానం లేదు. కొన్ని సార్లు చిరంజీవి (Chiranjeevi)పెద్దదిక్కు అంటూ రాజమౌళి లాంటి వారు కితాబిచ్చారు. కానీ చిరు మాత్రం తాను పెద్దదిక్కును కాదని చెబుతున్నారు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు చిరు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుపై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy) షాకింగ్ కామెంట్స్ చేశారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో టాలీవుడ్ కు ఒక పెద్దదిక్కు ఉండేవారు. ఆయన చేసే పనుల వల్ల ఆయన పెద్దదిక్కుగా మారారు. కానీ ఆయన ఇప్పుడు లేరు. ఆయన స్థానంలో ఇప్పుడు ఎవరూ లేరు. ఇంకొకరు రాలేరు’ అంటూ చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy). ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరని చెప్పడానికే ఆయన ఇలా మాట్లాడేరేమో అంటున్నారు కొందరు. ఇంకొందరేమో చిరంజీవిని ఉద్దేశించే ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: ఆ హీరోయిన్‌తో కీరవాణి కొడుకు పెళ్లి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>