కలం, డెస్క్ : నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్ అయ్యాయి. 5-డే వర్క్ వీక్ కావాలంటూ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె (Bank Strike) బాట పట్టారు. యునైటెడ్ ఫోర్ ఆఫ్ బ్యాక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపుతో మొత్తం తొమ్మిది బ్యాంక్ యూనియన్లు ఒక రోజు సమ్మెకు జై కొట్టాయి. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు నేడు సమ్మెలో పాల్గొంటున్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులైన ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరికొన్ని బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. HDFC, ICICI, Axis లాంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. రేపటి నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
Read Also: కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
Follow Us On: Pinterest


