epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

నాంప‌ల్లి మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ప‌రిహారం

క‌లం, వెబ్ డెస్క్: నాంప‌ల్లి అగ్ని ప్ర‌మాదం(Nampally Fire Accident)లో మృతి చెందిన వారి కుటుంబాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం(Telangana Government) ప‌రిహారం ప్ర‌క‌టించింది. నాంప‌ల్లిలోని బ‌ట్చాస్ ఫ‌ర్నీచ‌ర్ షాప్‌లో శ‌నివారం జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. 22 గంట‌ల సుధీర్ఘ రెస్క్యూ అనంత‌రం వీరి మృత‌దేహాల‌ను నేడు ఉద‌యం వెలికితీశారు. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) స్పందించారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ప‌రిహారం చెల్లిస్తామ‌ని తెలిపారు. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్ హరి చందనకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణ‌మ‌ని తేలింద‌ని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని మంత్రి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో అగ్నిమాపక నిబంధనల‌ను మ‌రింత‌ కఠినతరం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>