కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) టోర్నమెంట్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన క్రమంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్ ఆడకపోతే తాము కూడా టోర్నమెంట్ ను బాయ్ కాట్ చేస్తామని వ్యాఖ్యానించాడు. బంగ్లాకు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. నఖ్వీ (Mohsin Raza Naqvi) వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ICC) పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆంక్షులు విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ తరుణంలో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే పొట్టి క్రికెట్ ప్రపంచకప్ కు జట్టును ప్రకటించడం గమనార్హం. ఐసీసీ వార్నింగ్ తోనే పాకిస్తాన్ దిగివచ్చిందని స్పోర్ట్స్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Follow Us On: Instagram


