కలం, తెలంగాణ బ్యూరో : ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌కు (Naini Coal Block) మైనింగ్ యాక్టివిటీస్ కోసం గతంలో జారీ అయిన టెండర్ నోటిఫికేషన్ రద్దయింది. ‘సైట్ విజిట్ తప్పనిసరి’ అనే నిబంధన వివాదాస్పదం కావడంతో రద్దు చేయనున్నట్లు విద్యుత్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడు రోజుల క్రితం ప్రకటించారు. దానికి అనుగుణంగా సింగరేణి (Singareni) కాలరీస్ యాజమాన్యం తాజాగా రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్ నిబంధనలను పెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సైతం టెండర్‌పై ఢిల్లీలో బుధవారం కామెంట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి సంస్థ ప్రకటించింది. పరిపాలనాపరమైన కారణాల రీత్యా దీన్ని రద్దు చేసినట్లు వివరణ ఇచ్చింది.
ఉద్దేశపూర్వకంగా కొద్దిమందికి టెండర్‌ను కట్టబెట్టాలన్న భావనతోనే ‘సైట్ విజిట్ కంపల్సరీ’ అనే నిబంధన పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వంపైనా, సింగరేణి యాజమాన్యంపైనా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం రద్దు చేస్తామని ప్రకటించారు. తొలుత ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్స్ ప్రక్రియ మొదలుకావాల్సి ఉన్నది. కానీ టెండర్ నిబంధన వివాదాస్పదం కావడంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ స్పందించి నిబంధనలను పెట్టేముందు సింగరేణి యాజమాన్యం తమతో ఎందుకు చర్చించలేదని జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలకు ఎందుకు ఆస్కారం ఇచ్చారంటూ కామెంట్ చేశారు.
టెండర్ వేస్తున్న సంస్థలకు ‘సైట్ విజిట్’ ధ్రువీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలుకాలేదని, నిబంధనలు, ఇతర అంశాలపై బోర్డులో చర్చించిన తర్వాత మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నైని కోల్ బ్లాక్‌కు (Naini Coal Block) టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
Read Also: ఝార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం
Follow Us On: Youtube


