కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ ఫామ్ హౌస్ (Moinabad Farmhouse) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ (Putta Mahesh Kumar) సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. ముందుగా పుట్టాకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎస్పీ దీనిపై వివరణ ఇస్తూ ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో అంశంలో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో పుట్టా మహేశ్ కుమార్ (Putta Mahesh Kumar) గతంలో డ్రగ్స్ పై చేసిన ట్వీట్ తాజాగా వైరల్‌గా మారింది. గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ ఓవర్ డోసేజ్ వల్ల 2107 మంది చనిపోయారని, మీ ఓటు ఏపీలో డ్రగ్స్‌ను అడ్డుకోగలదు అంటూ పుట్టా ఎన్నికల ముందు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయనే డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో నెటిజన్లు విమ్శలు గుప్పిస్తున్నారు.
Read Also: మూసీ వ్యయం.. 6నెలల్లో 1350 కోట్లు ఎలా పెరిగింది?: కవిత
Follow Us On: Instagram

