టార్గెట్​ ఒకరు.. బలైంది మరొకరు : నార్సింగిలో విషాదం

కలం, వెబ్​ డెస్క్​: మెదక్ జిల్లా నార్సింగి (Narsingi)లో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కనే ఉండే కుటుంబంపై కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి వారిని అంతం చేయాలనే ఆలోచనతో చేసిన పన్నాగం, సంబంధం లేని ఒక అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒకరిని లక్ష్యంగా చేసుకుని పెట్టిన విద్యుత్ ఉచ్చులో మరొకరు చిక్కుకుని మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. నార్సింగి (Narsingi)కి చెందిన భూపాల్ రెడ్డి అనే వ్యక్తి, తన ఇంటి పక్కన నివసించే కుటుంబంతో ఉన్న పాత కక్షల నేపథ్యంలో వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే వారు బట్టలు ఆరేసే తీగకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అయితే అదే రోజు ఆ ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యానికి బంధువైన శ్యామ్ సుందర్ రెడ్డి వచ్చారు.

శుభకార్యం హడావుడిలో ఉన్న శ్యామ్ సుందర్ రెడ్డి స్నానం ముగించుకుని వచ్చి, తన తడి టవల్‌ను ఆరేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యుత్ ప్రవహిస్తున్న తీగను తాకడంతో ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చికిత్స అందేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

ప్రారంభంలో ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన విద్యుత్ ఘాతంగానే అందరూ భావించారు. కానీ పక్కనే ఉన్న భూపాల్ రెడ్డి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ జరపగా, భూపాల్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం విద్యుత్ తీగలను అమర్చినట్లు నిజం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 Read Also: బైక్ పొగతో ఒకే ఫ్యామిలీలో న‌లుగురు మృతి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>