ప్లస్ టు ఎగ్జామ్స్ రద్దు.. సీబీఎస్ఈ కీలక ప్రకటన!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ జరగాల్సిన సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షలను (Exams) రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేర‌కు బోర్డు తాజాగా ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

బోర్డు ఉత్తర్వుల ప్రకారం మార్చి 16, 2026 నుండి ఏప్రిల్ 10, 2026 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు (CBSE Exams) రద్ద‌య్యాయి. అంతేకాకుండా, గతంలో వివిధ తేదీల్లో (మార్చి 1 నుండి 9 వరకు) వాయిదా పడిన పరీక్షలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆయా దేశాల్లోని పరిస్థితులు, స్కూల్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. అయితే, పరీక్షలు రద్దు కావడంతో ఈ విద్యార్థుల ఫలితాలను ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారనేది బోర్డు ఇంకా వెల్లడించలేదు. ఫలితాల వెల్లడికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని అధికారులు వివరించారు. ఈ సమాచారాన్ని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు, సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్‌లకు ఇప్పటికే చేరవేశారు.

 Read Also: మూసీ వ్యయం​.. 6నెలల్లో 1350 కోట్లు ఎలా పెరిగింది?: కవిత

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>