అత్తాపూర్‌లో హైడ్రా కూల్చివేత‌లు.. సిక్కుల ఆందోళ‌న‌!

క‌లం, వెబ్ డెస్క్‌: అత్తాపూర్‌ (Attapur)లో ఆదివారం ఉద‌య‌మే హైడ్రా (HYDRAA) కూల్చివేతలు మొద‌ల‌య్యాయి. స్థానిక శివాలయం వద్ద ఉన్న వివాదాస్పద భూముల వద్దకు ఉద‌యం 8 గంట‌ల‌కు చేరుకున్న హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చి వేత‌లు ప్రారంభించారు. సీతారామ చంద్రస్వామి భూముల్లో ఉన్న రేకుల షెడ్లను, గ‌దుల‌ను తొల‌గిస్తున్నారు. కూల్చివేత‌ల‌పై స్థానికంగా ఉన్న సిక్కులు ఆందోళ‌న‌కు దిగారు. గురుద్వార్ భూమిని కాపాడాలంటూ ప్ల‌కార్డులు ప‌ట్టుకొని కూల్చివేత‌ల‌కు అడ్డుప‌డ్డారు. కూల్చివేతలు ఆపాలని నిరసన తెలిపారు. పోలీసులు వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వారు నిర్మాణాల‌కు ముందు అడ్డుగా ప‌డుకొని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంత‌రం య‌థావిధిగా కూల్చివేతలు కొన‌సాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>