కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ నుంచి అర్ధాంతరంగ వెళ్లిపోవడంపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) స్పందించారు. తాను గాంధీ భవన్ కు ఇతర పనిమీద వచ్చానని చెప్పారు. అసలు జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఎందుకు మీటింగ్ నుంచి వాకౌట్ చేశారో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ నిజమాబాద్ పార్లమెంట్ నియోజవర్గ నేతల మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు MLA Sanjay Kumar రావడం చూసిన జీవన్ రెడ్డి అసహనానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెడతారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమావేశం నుంచి జీవన్ రెడ్డి వాకౌట్ చేశారు. ఈ సంఘటన కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


