Mobile Popup Ad
Mobile Popup Ad

పేదలకు గుడ్‌న్యూస్.. మిర్యాలగూడలో సిద్ధమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

కలం, నల్లగొండ బ్యూరో: ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను (2BHK) లబ్ధిదారులకు అందించాలని మిర్యాలగూడ (Miryalaguda) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ వారు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎల్ఆర్ (MLA BLR), కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మిగిలి ఉన్న అన్ని పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, ప్లంబింగ్ పనులు, టాయిలెట్లు, కిచెన్ ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

ఇళ్లన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ (Miryalaguda) సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గృహ నిర్మాణం పీడీ రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>