కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృషి ఫలించింది. పిఠాపురం రైల్వే స్టేషన్‌కు (Pithapuram Railway Station) మహర్దశ పట్టనున్నది. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం పరిధిలో పిఠాపురం రైల్వే స్టేషన్‌ను చేర్చాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో పిఠాపురం స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఆధునిక సదుపాయాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, శుభ్రత, డిజిటల్ సదుపాయాలు, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ వంటి అంశాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
పిఠాపురం అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన కృషి ఫలితంగానే ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం ప్రాంత ప్రజలకు ఇది ఎంతో మేలు చేసే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఈ క్రమంలో పిఠాపురం స్టేషన్‌కు చోటు దక్కడం స్థానిక ప్రజలకు శుభవార్తగా నిలిచింది.
Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !
Follow Us On: X(Twitter)

